Eluru: ఏలూరు జిల్లాలో 542 సర్పంచ్, 5,676 వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

Eluru: ఏలూరు జిల్లాలోని 542 గ్రామ పంచాయతీ సర్పంచ్, 5,676 వార్డు మెంబర్ల పదవులకు రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారికంగా ఖరారు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Oct 2026 11:47 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో 542 సర్పంచ్, 5,676 వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

ఏలూరు: ఏలూరు జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలకు సంబంధించి 542 సర్పంచ్ లు ,5676 గ్రామ వార్డు మెంబెర్స్ మీపదవులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలియజేసారు.జిల్లాలోని 542 గ్రామ పంచాయతీలకు సంబంధించి మహిళలకు 266 స్థానాలు, జనరల్ కు 276 స్థానాలు కేటాయించారు.

వాటిలో షెడ్యూల్డ్ ఏరియాలోని 63 స్థానాలకుగాను మహిళలకు 31 స్థానాలు,జనరల్ కు 32 స్థానాలు అని బీబీ100 శాతం షెడ్యూల్డ్ తెగల తండాలు కలిగిన 2 ఎస్టీ పంచాయతీలలో ఒకటి మహిళలకు, మీఒకటి జనరల్ కు కేటాయించినట్లు చెప్పారు.

అదేవిధంగా నాన్ -షెడ్యూల్డ్ ప్రాంతాలలోని 479 స్థానాలకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలకు 6 స్థానాలకు గాను 2 మహిళలకు, 4 జనరల్ కు, షెడ్యూల్డ్ కులాలలకు 121 స్థానాలకు గాను 56 మహిళలకు, 65 జనరల్ కు, వెనుకబడిన తరగతులకు 104 స్థానాలకు గాను 52 మహిళలకు,52 జనరల్ కు, రిజర్వు కాని కేటగిరీకి 246 స్థానాలకు గాను 124 మహిళలకు,122 జనరల్ కు కేటాయించినట్లు తెలిపారు.

జిల్లాలోని 5676 వార్డ్ మెంబర్ల స్థానాలకు సంబంధించి షెడ్యూల్డ్ ఏరియాలోని 63 గ్రామ పంచాయతీలలోని 626 వార్డ్ మెంబర్ల స్థానాలకుగాను మహిళలకు 313 స్థానాలు , జనరల్ కు 313 స్థానాలు కేటాయించారు.షెడ్యూల్డ్ కులాలకు 403 స్థానాలకు గాను 187 స్థానాలు మహిళలకు, 216 స్థానాలు జనరల్ కు కేటాయించారు.

రిజర్వు కాని కేటగిరీకి సంబంధించి 223 స్థానాలకు గాను 126 మహిళలకు,97 జనరల్ కు కేటాయించినట్లు చెప్పారుnనాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని 479 గ్రామ పంచాయతీలలోని 5050 వార్డ్ మెంబర్ల స్థానాలకుగాను మహిళలకు 2525 స్థానాలు , జనరల్ కు 2525 స్థానాలు కేటాయించారు. షెడ్యూల్డ్ తెగలకు 92 స్థానాలకు గాను 37 మహిళలలకు, 55 జనరల్ కు కేటాయించారు.

షెడ్యూల్డ్ కులాలకు 1289 స్థానాలకు గాను 560 స్థానాలు మహిళలకు, 729 స్థానాలు జనరల్ కు కేటాయించారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి 1099 స్థానాలకు గాను 521 మహిళలకు ,574 జనరల్ కు కేటాయించారు. రిజర్వు కాని కేటగిరీకి సంబంధించి 2570 స్థానాలకు గాను 1407 మహిళలకు,1163 స్థానాలు జనరల్ కు కేటాయించినట్లు కలెక్టర్ తెలియజేసారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్