Eluru: ఏలూరు జిల్లాలో పీజీఆర్‌ఎస్ రద్దు: కలెక్టర్ వెట్రిసెల్వి!

Eluru: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా డిసెంబర్ 3 వరకు ఏలూరు జిల్లాలో పీజీఆర్‌ఎస్ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 12:17 AM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో పీజీఆర్‌ఎస్ రద్దు: కలెక్టర్ వెట్రిసెల్వి!

ఏలూరు: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున,ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు (డిసెంబర్ 3వ తేదీ వరకు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.

అయితే,అర్జీదారులు తమ ఫిర్యాదుల నమోదు మరియు వాటి స్థితిని (Status) తెలుసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

అధికారిక వెబ్‌సైట్: ప్రజలు meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చు అని టోల్ ఫ్రీ నెంబర్: 1100 నెంబర్ కి ఫోన్ చేసి కూడా ఫిర్యాదులు నమోదు చేసుకుని,వాటి స్థితిని తెలుసుకోవచ్చు అని ఈ సమాచారాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్