Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు!

Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు. వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జిల్లా అధికారులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 6:16 PM IST
Eluru
X

Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు!

Eluru: ఏలూరు జిల్లా మహర్షి వాల్మీకి జయంతిని ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కె.వెట్రిసెల్వి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహర్షి వాల్మీకి రత్నాకరుడు అనే బోయవానిగా ఉండేవారని,నారద మహర్షి ఉపదేశంతో రామ తారక మంత్రం జపించి తపస్సు చేశారన్నారు. సంస్కృత సాహిత్యంలో తొలి కావ్యానమైన శ్రీమద్ రామాయణాన్ని 24,000 శ్లోకాలతో మహర్షి వాల్మీకి రచించారన్నారు. వాల్మీకి మహర్షి సీతాదేవికి తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి లవకుశులను పెంచి విద్యాబుద్ధులు నేర్పారన్నారు.మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,ఇంచార్జ్ డిఆర్ఓ ఎం.ముక్కంటి, ఎస్డిసి దేవకీదేవి,డీఈఓ వెంకటలక్ష్మమ్మ,సాంఘిక సంక్షేమ శాఖ జేడీ విశ్వమోహన్ రెడ్డిసెట్ వెల్ సీఈఓ ప్రభాకర్,గృహనిర్మాణ శాఖాధికారి సత్యనారాయణ,పర్యాటక శాఖాధికారి పట్టాభిరామయ్య,ఆర్టీఓ శేఖర్,బిసి కార్పొరేషన్ ఈడి పుష్పలత,ఆర్టీసీ ఆర్ ఎం షబ్నమ్,కలెక్టరేట్ సిబ్బంది ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్