Eluru: ఆక్వాన్ తుపాను హెచ్చరిక.. ఉద్యానవన రైతులు అప్రమత్తంగా ఉండాలి!

Eluru: ఆక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అరటి, బొప్పాయి, కూరగాయల రైతులు కోతకు వచ్చిన పంటలను సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలని డీడీ సాజా నాయక్ సూచించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 18 Nov 2026 12:37 PM IST
Eluru
X

Eluru: ఆక్వాన్ తుపాను హెచ్చరిక.. ఉద్యానవన రైతులు అప్రమత్తంగా ఉండాలి!

ఏలూరు: వాతావరణ శాఖ ఆక్వాన్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అరటి, బొప్పాయి,కూరగాయలు పంటలు రైతులు తమ పంటలను కోసి సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవలసిందిగా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సాజా నాయక్ తెలిపారు.

జిల్లాల్లో అరటి 1200 హెక్టార్లలో సాగు అవుచున్నదని దాదాపు 400 హెక్టార్లలో అరటి గెలలు కోత దశలో ఉన్నాయని, రైతులు అరటి గెలలు కోసి సురక్షిత ప్రాంతంలో నిల్వ చేసుకోవలసినదిగా మరియు దగ్గరలో ఉన్న మార్కెట్ కి తరలించి విక్రయించుకోవలసినదిగా సాజా నాయక్ అరటి రైతులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కూరగాయలు కూడా కోత అనంతరము దగ్గరలో ఉన్న మార్కెట్ కి తరలించి విక్రయించుకోవలసినదిగా కోరారు.

తుఫాను సమయంలో బోరు బావులు, మోటార్ల విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, పొలాల్లో, షెడ్లు, ఫాం హౌస్‌లలో ఉండవద్దని, సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని, తుఫాను తర్వాత: పంట నష్టం వివరాలను రైతు సేవా కేంద్రాలలో సిబ్బందికి మరియు ఉద్యాన అధికారికి తెలియజేయాలన్నారు. తుఫాను పరిస్టితుల దృష్ట్యా ఉద్యానవన రైతులు అప్రమత్తంగా పంట రక్షణ సూచనలను పాటించాలన్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid