Eluru: మూడు రోజులు భారీ వర్షాలు: అధికార యంత్రాంగం అప్రమత్తం!

Eluru: ఏలూరు జిల్లాలో 3 రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 12:13 AM IST
Eluru
X

Eluru: మూడు రోజులు భారీ వర్షాలు: అధికార యంత్రాంగం అప్రమత్తం!

ఏలూరు: తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.ఏలూరు జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు,తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై ఆదివారం సాయంత్రం ఆమె అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నదులు,చెరువులు,కాలువలకు గండ్లు పడకుండా ఇరిగేషన్ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలి అని తీరం దాటే సమయంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు నదుల్లోకి వెళ్లకుండా నిలువరించి,శిథిల భవనాలు,చెట్ల కింద ఉండకుండా చూడాలి అని చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలి అని,నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కల్వర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదాలు జరగకుండా నిఘా ఉంచాలి అని ప్రజలకు సహాయం,సమాచారం కోసం ఏలూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

ప్రజలు క్రింది నంబర్లలో సంప్రదించవచ్చు:

టోల్ ఫ్రీ:18002331077

ల్యాండ్‌లైన్: 08812-224519

మొబైల్: 9491041419

ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,సబ్ కలెక్టర్ బి. వినూత్న,ఆర్డీఓలు లక్ష్మి ప్రసన్న,రమణ,ట్రాన్స్‌కో ఎస్ఈ అంబేద్కర్,పంచాయతీరాజ్ ఎస్ఈ జెడ్.రమేష్ మరియు తహసీల్దార్లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్