Eluru: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు: డీఈఓ!
Eluru: ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు 2027 మార్చి నుండి 'బడి పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహిస్తామని డీఈఓ వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
Eluru: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు: డీఈఓ!
ఏలూరు: ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) వెంకటలక్ష్మమ్మ తెలిపారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో జననాల రేటు తగ్గడం, జనాభా మార్పుల కారణంగా పాఠశాలల్లో ప్రవేశాలు తక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు 2027 మార్చి నుండి 'బడి పిలుస్తోంది' కార్యక్రమం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, డిజిటల్ తరగతి గదులు,ల్యాబ్‌లు మరియు ప్రభుత్వ పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష సిబ్బంది సమన్వయంతో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ ద్వారా పాఠశాలల్లో చేర్పించేలా కార్యాచరణ అమలు చేస్తామని డీఈఓ వెల్లడించారు.




