Eluru: ఏలూరు జిల్లాలో కుండపోత వర్షం.. మండవల్లిలో అత్యధికంగా 39.5 మి.మీ వర్షపాతం!
Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా గత రాత్రి భారీ వర్షం. 28 మండలాల్లో సగటున 395.7 మి.మీ వర్షపాతం నమోదు. అత్యధికంగా మండవల్లిలో 39.5 మి.మీ నమోదు.
Eluru: ఏలూరు జిల్లాలో కుండపోత వర్షం.. మండవల్లిలో అత్యధికంగా 39.5 మి.మీ వర్షపాతం!
Eluru: ఏలూరు జిల్లా వ్యాప్తంగా గత రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి నేడు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.మొత్తం జిల్లాలోని 28 మండలాల్లో సగటున 395.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తెల్లవారుజాము నుండి భారీ ఈదురు గాలులు వీస్తూ ఉన్నాయి.
అత్యధిక వర్షపాతం మండవల్లి మండలంలో 39.5 మిల్లీమీటర్లు నమోదు కాగా అతి తక్కువ వర్షపాతం పెద్దపాడు మండలంలో 5.8 మిల్లీమీటర్లుగా నమోదయింది.జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ అప్రమత్తమై ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి,జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.




