Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో నేడు న్యాయ అవగాహన సదస్సు!
Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో శనివారం ఉదయం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జడ్జ్ ఎస్. శ్రీదేవి తెలిపారు; సంక్షేమ పథకాలు డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తారు.
Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో నేడు న్యాయ అవగాహన సదస్సు!
Eluru: ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో ఈనెల 19వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా సెషన్స్ జడ్జ్ ఎస్.శ్రీదేవి తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు-నియంత్రణ,మరియు ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకత్వం వంటి కీలకమైన న్యాయ పరమైన అంశాలపై ఈ సదస్సులో ప్రజలకు అవగాహన కల్పిస్తారని ఆమె పేర్కొన్నారు.




