Chintalapudi: సీతానగరం గోద్రెజ్ ఫ్యాక్టరీ వద్ద పామాయిల్ రైతుల ధర్నా!
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద రైతులు భారీ ధర్నాకు దిగారు.
Chintalapudi: సీతానగరం గోద్రెజ్ ఫ్యాక్టరీ వద్ద పామాయిల్ రైతుల ధర్నా!
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం లేదని, 20% ఉండగా 17% చూపించి రైతులకు తక్కువ రేటు ఇస్తున్నారని రైతులు ఫ్యాక్టరీ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
గతంలో ప్రశ్నించిన రైతులపై 5 కేసులు పెట్టారని యాజమాన్యం కోర్టుకు వెళ్లకపోవటంతో కోర్టు కేసులు కొట్టివేసిందని, మళ్ళీ అన్యాయం పై నిలదీసినందుకు మళ్ళీ మరో కేసు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో 20%కన్నా ఎక్కవ నాణ్యత చూపిస్తుందని, ఈ ఫ్యాక్టరీ లో 17% మాత్రమే చూపి దానికి తగ్గట్టు ధర ఇస్తున్నారని దీనివల్ల ఎకరాకు లక్షకు పైగా నష్టపోతున్నట్లు రైతులు చెపుతున్నారు.
అంతే కాక పక్కనే ఉన్న తెలంగాణా రాష్ట్రం లో రైతులు పామాయిల్ గెలలను అమ్ముకోకుండా ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూప్ లలో పెడుతున్నారని, తెలంగాణా రాష్ట్రం లోని ఫ్యాక్టరీ వాళ్లకు మా ఏరియాలో పండే పంట ను మీరెలా కొంటారని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
గెలల గ్రేడింగ్ పేరుతో ట్రాక్టర్ కి 400 నుండి 500kg ల గెలలను పక్కన పెట్టేస్తున్నారని దానివల్ల ట్రాక్టర్ కు 10వేల రూపాయలవరకు నష్టం వాటిల్లుతుందని, అంతేకాకుండా రైతులతో ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించలేదని, సమావేశాలు పెట్టీ సూచనలు ఇస్తే ఆవిధంగా రైతులు నడుచుకుంటారని అన్నారు.
రైతులు పండించిన పామాయిల్ పంటను ఏ రాష్ట్రంలో అయినా అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే తమకు నచ్చిన చోట ఎక్కువ ధర ఇచ్చే చోట అమ్ముకోగలమని రైతులు అంటున్నారు.
ఈ కార్యక్రమం సురానేని గోపి గారి ఆధ్వర్యంలో పామాయిల్ రైతులు, రైతు సంఘాలు నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.




