Eluru: ఏలూరులో పకడ్బందీగా ఎన్నికల భద్రత: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎస్ఈసీకి తెలిపారు.
Eluru: ఏలూరులో పకడ్బందీగా ఎన్నికల భద్రత: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా,ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా కు తెలియజేసారు. మునిసిపల్ ఎన్నికలు పోలింగ్,ఎంపిపి,జెడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల నామినేషన్లు,పోలింగ్ ప్రక్రియలపై జిల్లా కలెక్టర్లు,ఎస్పీ లతో సోమవారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ రాష్ట్రంలోని 659 జెడ్పీటీసీ,9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా,ఎన్నికలలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా సమస్యాత్మక,అతి సమస్యాత్మక ప్రాంతాలపై పోలీస్ అధికారులతో చర్చించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై నివేదిక అందించాలన్నారు.రాష్ట్రంలో పలు ప్రదేశాలలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని,అటువంటి సంఘటనలు రాష్ట్రంలో మరెక్కడా పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతకు పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
ఏలూరు కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పురపాలక సంఘాల ఎన్నికలలో ఏ 376 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని,వీటిలో 297 సాధారణం కాగా,46 సమస్యాత్మకం, 33 అతి సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాలలో అదనపు బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం.ముక్కంటి,జిల్లా పరిషత్ సీఈఓ ఎం.కృష్ణమోహన్, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు,ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఎస్డీసీ దేవకీదేవి,తదితరులు పాల్గొన్నారు.




