Eluru: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్!

Eluru: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Oct 2026 11:10 PM IST
Eluru
X

Eluru: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్!

ఏలూరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా,పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించారు. నేడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఏలూరు,జంగారెడ్డిగూడెం, పోలవరం,నూజివీడు సబ్ డివిజన్ల పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి అని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, భయపెట్టినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి అని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు,డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హబీబ్ భాషా,పలువురు డీఎస్పీలు,సీఐలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్