Eluru: ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు!
Eluru: యువత సైబర్ నేరాలు, డ్రగ్స్ బారిన పడొద్దు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి. NCC, NSS విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు, టోల్ ఫ్రీ 15100 పై అవగాహన.
Eluru: ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు!
ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా సోమవారం ఎన్‌సీసీ,ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు "యువత ఎదుర్కొంటున్న సమస్యలు-పరిహారం" అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించాయి.
ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో యువత మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, ర్యాగింగ్, సైబర్ నేరాల బారిన పడకుండా క్రమశిక్షణతో భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా యువతకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 15100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించి పరిష్కారం పొందవచ్చని తెలిపారు.
అలాగే,పెండింగ్‌లో ఉన్న రాజీయోగ్యమైన క్రిమినల్,సివిల్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా వేగంగా పరిష్కరించుకోవడానికి 'మధ్యవర్తిత్వం 3.0' కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ పి.రత్నరాజు,ప్యానల్ న్యాయవాది పి.వెంకటేశ్వరరావు, క్రాఫ్ సంస్థ ప్రతినిధులు ప్రభాకర్ రావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.




