Eluru: ఏలూరును బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: శ్రీలక్ష్మి!
Eluru: తొలి అంతర్జాతీయ బాల్యవివాహాల నిరోధక దినోత్సవం సందర్భంగా ఏలూరులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రారంభించారు.
Eluru: ఏలూరును బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: శ్రీలక్ష్మి!
ఏలూరు: ఏలూరు జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. తొలి అంతర్జాతీయ బాల్యవివాహాల నిరోధక దినోత్సవం సందర్భంగా ఏలూరులో అవగాహన సదస్సులు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ,జిల్లా బాలల పరిరక్షణ విభాగం, క్రాఫ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని శ్రీలక్ష్మి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహం ఒక సాంఘిక దురాచారమని, దీనిని రూపుమాపడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే వెంటనే పోలీస్, రెవెన్యూ లేదా న్యాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. బాల్యవివాహాలు జరిపించే వారిపైనే కాకుండా,ప్రోత్సహించే వారిపైనా కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
2030 నాటికి భారతదేశాన్ని బాల్యవివాహ రహిత దేశంగా మార్చే జాతీయ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ సూర్య చక్రవేణి, ఐసీడీఎస్ పీడీ శారద, డీఎస్పీ శ్రావణ్ కుమార్, క్రాఫ్ సంస్థ ప్రతినిధి ప్రభాకర్ తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.




