Eluru: ఎర్రకాల్వ వద్ద రూ. 2.86 కోట్లతో మత్స్య అభివృద్ధి ప్రాజెక్ట్!

Eluru: ఎర్రకాల్వ జలాశయం వద్ద రూ. 2.86 కోట్లతో మత్స్య, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రతిపాదనలు: ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశం. 664 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Sept 2026 11:15 PM IST
Eluru
X

Eluru: ఎర్రకాల్వ వద్ద రూ. 2.86 కోట్లతో మత్స్య అభివృద్ధి ప్రాజెక్ట్!

ఏలూరు: ఎర్రకాల్వ జలాశయం వద్ద మత్స్య, ఆక్వాకల్చర్ సమగ్ర అభివృద్ధి కోసం రూ. 2.86 కోట్లతో ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం ఆమె అధ్యక్షతన ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ (PMMSY) జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడిన ముఖ్యాంశాలు:లక్ష్యం: ఎర్రకాల్వ జలాశయ పరిధిలోని 664 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం,చేపల వేట, మార్కెటింగ్,కోల్డ్-చైన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం.

ప్రతిపాదిత సౌకర్యాలు రూ.45 లక్షలతో 15 ఐస్ బాక్సుల మోటార్ బోట్లు, చేప పిల్లల పెంపకం యూనిట్లు, వలల తయారీ కేంద్రాలు, ఐస్ బాక్సుల ఆటోలు/మోటార్ సైకిళ్లు,ఐస్ ప్లాంట్,నిల్వ కేంద్రాలు మరియు అమ్మకాల కోసంవేలం హాలు నిర్మిస్తారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సి.హెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, మత్స్యశాఖాధికారి ఆర్.వి.ఎస్.కె. ప్రసాదరావు, ఇరిగేషన్ ఎస్ఈ జి.గోపాల్, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్