Eluru: కొల్లేరు అభయారణ్య నివేదిక రూపకల్పన, నేడు ప్రభుత్వానికి సమర్పణ

Eluru: కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంపై కేంద్ర కమిటీ కోరిన అంశాలతో కూడిన తుది నివేదికను ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి నేతృత్వంలో రూపొందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Oct 2026 8:54 PM IST
Eluru
X

Eluru: కొల్లేరు అభయారణ్య నివేదిక రూపకల్పన, నేడు ప్రభుత్వానికి సమర్పణ

ఏలూరు: కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గురించి కేంద్ర సాధికార కమిటీ కోరిన అంశాలతో కూడిన తుది సమాచారాన్ని జిల్లా యంత్రాంగం రూపొందించి ఈనెల 7వ తేదీ న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

కేంద్ర సాధికార కమిటీ ఆదేశాల ననుసరించి కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని అభయారణ్యం సరిహద్దుల హేతుబద్దీకరణ, జిరాయితీ,డి.ఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సంరక్షణ కేంద్రం సరిహద్దుల హేతుబద్ధీకరణ తర్వాత,అన్ని వివరాలతో కూడిన విస్తీర్ణ నివేదిక,అభయారణ్యంలోని జిరాయితీదారుల తరలింపు పై మండలాల వారీగా తరలింపుపై ప్రతిపాదిత భూముల వివరాలు,జిల్లా మండలాల సరిహద్దులు,

ప్రభుత్వ భూములు,జిరాయితీ భూములు,డి-పట్టా భూములు,ఉప్పెటేరుతో సహా ప్రవేశ,నిష్క్రమణ మార్గాలు,పక్షుల ప్రాంతాలు, అభయారణ్య పరిధిలో నోటిఫైడ్,నాన్ నోటిఫైడ్ డ్రైన్లు వంటి పలు అంశాలపై కేంద్ర సాధికార కమిటి కోరిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,అటవీశాఖ అధికారి త్రిమూర్తులు రెడ్డి,ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, సంబంధిత మండలాల తహశీల్దార్లతో కలిసి తుది నివేదికను కలెక్టర్ రూపొందించారు.

సదరు నివేదికను ఈనెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం సమర్పించనుంది.ఈ సమావేశంలో ఇంచార్జ్ డిఆర్ఓ ఎం.ముక్కంటి, ట్రాన్స్కో ఎస్ఈ కె.ఎం.అంబేద్కర్ ,తహసీల్దార్లు,రెవిన్యూ,అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్