Eluru: 'అర్నాబ్' తుఫాన్ రాత్రి 9కి తీవ్రం – రంగంలో కలెక్టర్!

Eluru: ఏలూరులో అర్నాబ్ తుఫాన్ హై అలర్ట్. కలెక్టర్ వెట్రిసెల్వి అత్యవసర సమావేశం. 125-160 kmph పెనుగాలుల హెచ్చరిక, 438 మంది తరలింపు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 Oct 2026 11:01 PM IST
Eluru
X

Eluru: 'అర్నాబ్' తుఫాన్ రాత్రి 9కి తీవ్రం – రంగంలో కలెక్టర్!

ఏలూరు: "అర్నాబ్ తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా యంత్రాంగం హై అలర్ట్ అయింది.తుఫాన్ ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి కలెక్టరేట్‌లో అత్యవసర పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.జిల్లాలో గంటకు 125 నుండి 160 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు,శిథిల భవనాల్లోని సుమారు 438 మంది ప్రజలను ఇప్పటికే సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించామని స్పష్టం చేశారు.ఎన్‌డీఆర్‌ఎఫ్‌,ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించామన్నారు.

మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు తుఫాన్ తీవ్రత అత్యధికంగా ఉంటుందని,ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించామని. వర్షాలు తగ్గకపోతే గురువారం సెలవుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఆక్వా, వ్యవసాయ రైతులు పనులకు వెళ్ళవద్దని,అత్యవసర సహాయం కోసం జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 1800 2331077, 9491041419 లను సంప్రదించాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ పేరుతో బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్