Eluru: ఆయిల్ పామ్‌లో ‘గెనోడెర్మా’ నివారణకు జాగ్రత్తలు: ఉద్యాన శాఖ
Eluru: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం పాతూరులో ఆయిల్ పామ్ పంటలో గెనోడెర్మా (వేరు కుళ్ళు) తెగులు సమగ్ర నివారణపై ఉద్యాన శాఖ రైతులకు అవగాహన కల్పించింది.
Eluru: ఆయిల్ పామ్‌లో ‘గెనోడెర్మా’ నివారణకు జాగ్రత్తలు: ఉద్యాన శాఖ
Eluru: ఆయిల్ పామ్ పంటలో రైతులు ఎదుర్కొంటున్న వేరు కుళ్ళు (గెనోడెర్మా) తెగులు నిర్మూలనకు ఉద్యానవన శాఖ సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఉద్యానవన శాఖ ఉప సంచాలకులు (డిడి)సాజానాయక్ సూచించారు.
బుధవారం కామవరపుకోట మండలం పాతూరు గ్రామంలో ఉద్యానవన అధికారులు సాజానాయక్,రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డిడి సాజానాయక్ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లాలో 1,60,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు అవుతోందని,ఇటీవల కాలంలో 15 ఏళ్లు పైబడిన తోటల్లో ఈ గెనోడెర్మా శిలీంధ్రం ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు.వ్యాధి ప్రధాన లక్షణాలు ఈ విధంగా ఉంటాయి అనగా నేల ద్వారా వ్యాపించి కాండం మొదలును కుళ్ళింపజేస్తుందని, సకాలంలో నివారించకపోతే తోట మొత్తం నాశనమై రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.
చెట్లు నీటి ఎద్దడికి గురైనట్లు కనిపించడం,మొవ్వలో నుంచి లేత ఆకులు విచ్చుకోకపోవడం.ముదిరిన చెట్లలో క్రింది మట్టలు వంగిపోయి,నిటారుగా వేలాడుతూ విరిగిపోవడం.
ఆకులు లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారి చివర్లు ఎండిపోవడం.చివరి దశలో మొక్క మొదలు భాగంలో పుట్టగొడుగులు రావడం మరియు చెట్లు పూర్తిగా కూలిపోవడం వంటి పరిస్థితులు గుర్తించినట్లయితే ముందస్తు చర్యగా 100 కేజీల పశువుల ఎరువు/వేపపిండి/వర్మీకంపోస్ట్‌లో ఒక కేజీ చొప్పున ట్రైకోడెర్మా విరిడే మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కలిపి మొక్క మొదళ్లలో వేయాలి అని వ్యాధి సోకిన చెట్టు వేర్లు ఆరోగ్యవంతమైన చెట్లకు తగలకుండా ఉండేందుకు, ఆ చెట్టు చుట్టూ 1 మీటరు లోతు,30 సెం.మీ వెడల్పుతో గుంత (ట్రెంచ్) తవ్వాలి అని సూచించారు.
చనిపోయిన, పడిపోయిన చెట్ల కాండం,వేర్లను ముక్కలుగా చేసి పూర్తిగా కాల్చివేయాలి అని తోటలో కుళ్ళిపోయే సేంద్రియ పదార్థాలు లేకుండా చూసుకోవాలి అని తోటల్లో పచ్చి పశువుల పేడను అస్సలు వేయరాదు అని (ఇది శిలీంధ్రం పెరగడానికి దోహదపడుతుంది)చెట్ల మొదళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మరియు మల్చింగ్ ద్వారా తగిన తేమను నిర్వహించాలి అని తెలిపారు.




