Eluru: కమాండ్ రూమ్ నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్యవేక్షించిన ఐజీ, ఎస్పీ!

Eluru: ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని కమాండ్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించిన ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Nov 2026 2:39 PM IST
Eluru
X

Eluru: కమాండ్ రూమ్ నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్యవేక్షించిన ఐజీ, ఎస్పీ!

Eluru: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ రూమ్ నుంచి ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి.అశోక్ కుమార్,జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఏలూరు,నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా,పారదర్శకంగా జరిగేలా పోలీసు అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.వృద్ధులు,దివ్యాంగులు,మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్