Eluru: ఇండోనేషియా, థాయిలాండ్ ప్రతినిధుల ప్రకృతి వ్యవసాయ పర్యటన

Eluru: ఏలూరు జిల్లాలో ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో ఇండోనేషియా, థాయిలాండ్ ప్రతినిధుల బృందం ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Sept 2026 11:30 PM IST
Eluru
X

Eluru: ఇండోనేషియా, థాయిలాండ్ ప్రతినిధుల ప్రకృతి వ్యవసాయ పర్యటన

ఏలూరు: ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించేందుకు ఇండోనేషియా, థాయిలాండ్‌ దేశాలకు చెందిన 11 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది.ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం (APCNF) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 నుండి 30 వరకు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా,రెండవ రోజైన మంగళవారం ఉంగుటూరు,భీమడోలు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలలో బృందం పర్యటించింది.

ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.వెంకటేష్ నేతృత్వంలో జరిగిన ఈ పర్యటనలో వెల్లమిల్లి గ్రామంలో రైతు పి.సత్యనారాయణకు చెందిన ఫిష్ పేడీ మోడల్ (IFS మోడల్), పి. రాజేంద్రప్రసాద్‌కు చెందిన 'రైజ్డ్ బండ్ ప్యాడీ మోడల్' (Raised Band Paddy) మరియు ముర్రేల్ చేపల పెంపకాన్ని బృందం పరిశీలించింది.ఎ.గోకవరం గ్రామంలో రైతు యు.రామచంద్ర రాజు తోటలో కొబ్బరి,కోకో,వక్క, పసుపు,కంద వంటి పంటల సాగుకు సంబంధించిన '5 లేయర్ ఫీల్డ్ మోడల్'ను సందర్శించారు.

రైతు టి.మల్లేష్ పొలంలో 42 రకాల పంటలతో సాగు చేసిన 'ATM మోడల్'ను తిలకించారు.అంబర్ పేట భీమడోలులో ఇక్కడ ఏర్పాటు చేసిన 'AWD ఎక్స్పరిమెంట్ ప్లాంట్'ను బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగించే అగ్నాస్త్రం,వేపగింజల కషాయం,జీవామృతం,ఘన జీవామృతం,కోడిగుడ్డు-నిమ్మరసం ద్రావణం మరియు విత్తన గుళికల తయారీ విధానాన్ని అంతర్జాతీయ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో ప్రకృతి వ్యవసాయం అమలు తీరుపై వారు హర్షం వ్యక్తం చేశారు.ఈ పర్యటనలో ఆస్టుంగ్‌కారా వే ఆర్గనైజేషన్ (ఇండోనేషియా)కు చెందిన తిమోతీ జోసెఫ్ ఫిజాల్,సోఫియా యోహానా తదితరులు,బోర్డర్‌లెస్ ఫౌండేషన్ (థాయిలాండ్) ప్రతినిధులతో పాటు దక్షిణాఫ్రికా,ఆస్ట్రేలియా, జపాన్,మాయన్మార్ దేశాల సభ్యులు పాల్గొన్నారు.వీరితో పాటు అడిషనల్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ షేక్ మహబూబ్ వలి,డీపీపీ సత్య,పి.డోలాంబికా,వ్యవసాయ సిబ్బంది మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్