Eluru: బాలాసదనాలు, శిశుగృహలో 7 పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి
Eluru: ఏలూరు కలెక్టరేట్‌లో బాలాసదనాలు, శిశు గృహ పోస్టులకు ముగిసిన ఇంటర్వ్యూలు. 41 మందికి గాను 32 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఐసీడీఎస్ పీడీ శారద వెల్లడి.
Eluru: బాలాసదనాలు, శిశుగృహలో 7 పోస్టులకు ఇంటర్వ్యూలు పూర్తి
ఏలూరు: ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ పరిధిలోని దెందులూరు,నూజివీడు బాలాసదనాలు, అలాగే స్పెషలైజెడ్ అడాప్షన్ ఏజెన్సీ (శిశు గృహ) లలో ఖాళీగా ఉన్న 7 పోస్టుల భర్తీకి సోమవారం (ఈనెల 21న) ఏలూరు కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు విజయవంతంగా ముగిశాయి.
జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించినట్లు ఐసిడిఎస్ (ICDS) ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద ఒక ప్రకటనలో తెలిపారు.కుక్, హెల్పర్ కం నైట్ వాచ్‌వుమెన్, పార్ట్ టైం ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్, మరియు పార్ట్ టైం డాక్టర్ పోస్టుల కోసం ఈ ఇంటర్వ్యూలు జరిగాయి.
మొత్తం 41 మంది అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవగా, 32 మంది హాజరయ్యారని, 9 మంది గైర్హాజరయ్యారని పీడీ శారద వివరించారు.




