Eluru: జాలిపూడి ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు!

Eluru: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జాలిపూడి ఉన్నత పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి విద్యార్థులకు పోక్సో, మానవ అక్రమ రవాణా చట్టాలపై అవగాహన కల్పించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 9:36 PM IST
Eluru
X

Eluru: జాలిపూడి ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు!

ఏలూరు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీలక్ష్మీ జాలిపూడి గ్రామంలోని ఉన్నత పాఠశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ బాలల దినోత్సవం సందర్భంగా‌ (ప్రాచీన బాల్యం-సురక్షిత బాల్యం) 'సమాజంలో సురక్షితమైన రేపటి కోసం నేటి అవగాహన' కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మానవ అక్రమ రవాణా, ఫోక్సో, సురక్షితమైన-స్పర్శ,భద్రత, తదితర చట్టాల పైన అవగాహన కల్పించారు.

విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, ఉన్నతమైన విద్య మంచి భవిష్యత్తు అందిస్తుందని సూచించారు. ప్రస్తుతం విద్యార్థులు మానవ అక్రమ రవాణా,మాదకద్రవ్యాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, అత్యాచారాలు మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, కావున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్