Eluru: ధరణి నాణ్యమైన బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి

Eluru: ఏలూరు పత్తేబాద్ రైతుబజార్‌లో 'ధరణి-నాణ్యమైన బియ్యం' విక్రయాలను జేసీ అభిషేక్ గౌడ తనిఖీ చేశారు. కిలో రూ.49, రూ.50 కే బియ్యం విక్రయాలు పర్యవేక్షణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Oct 2026 7:03 PM IST
Eluru
X

Eluru: ధరణి నాణ్యమైన బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలి

ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ధరణి – నాణ్యమైన బియ్యం’ కార్యక్రమాన్ని జిల్లాలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పటిష్టంగా అమలు చేయాలని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఏలూరులోని పత్తేబాద్ రైతుబజార్‌లోని ప్రత్యేక కౌంటర్లలో జరుగుతున్న బియ్యం విక్రయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఏలూరు పత్తేబాద,వన్ టౌన్,నూజివీడు,మరియు కైకలూరు రైతుబజార్లలోని ప్రత్యేక కౌంటర్లులో BPT రకం బియ్యం కిలో రూ.49,KNM రకం బియ్యం కిలో రూ.50 చొప్పున వినియోగదారుల సౌకర్యార్థం ఒక్కో బస్తాలో 26 కిలోల బియ్యం ఉండేలా

నిర్ణీత సమయాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అమ్మకాలు జరపాలని,స్టాక్ కొరత లేకుండా చూసుకోవాలని జేసీ అధికారులకు స్పష్టం చేశారు.ఈ తనిఖీలో జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ డీఎం శివరామ మూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్