Eluru: తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది

Eluru: ఏలూరులో జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Oct 2026 8:21 PM IST
Eluru
X

Eluru: తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది

ఏలూరు: వృద్ధాప్యంలో ఉన్న తల్లితండ్రులను చూసుకోవలసిన బాధ్యత కన్నబిడ్డలపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు.స్థానిక జిల్లా పరిషత్లో గురువారం విభిన్న ప్రతిభావంతులు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వృద్ధుల దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి,వారి హక్కుల పరిరక్షణకు విభిన్న ప్రతిభావంతులు,వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు.వృద్ధాప్యంలో తల్లితండ్రులను నిరాదరణకు గురించే బిడ్డలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో ఎవరైనా వృద్దులు తమ పిల్లల ప్రవర్తన కారణంగా నిరాదరణకు గురైతే వెంటనే దగ్గరలోని రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే సదరు పిల్లలపై చర్యలు తీసుకుంటామన్నారు.తల్లితండ్రులు తమ ఆస్తులను పిల్లలకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తమ యోగక్షేమాలు తప్పనిసరిగా చూడాలని లేనిపక్షంలో రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందని అంశాన్ని పొందుపరచాలన్నారు.

జిల్లా లోని వయోవృద్ధులకు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.జిల్లాలోని వయో వృద్ధులకు సేవలు అందించే 9 మంది వయో వృద్ధులకు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ శ్రావణ కుమార్ రెడ్డి,డిపిఓ జి వి కె.మల్లిఖార్జునరావు,మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్,రాజాబాబు, సెట్ వెల్ సీఈఓ ప్రభాకరరావు,అల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ కార్యదర్శి వెంపరాల నారాయణ మూర్తి,ఏలూరు జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి గణేష్,వయో వృద్ధుల సంక్షేమ సంఘ ప్రతినిధులు ఎస్.జానకి రామ రాజు,ఉత్తమ దుర్గా దేవి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్