Eluru: ఏలూరు జిల్లాలో త్వరలో 100 ‘మీ మార్ట్’లు: జేసీ అభిషేక్ గౌడ!

Eluru: ఏలూరు జిల్లాలో త్వరలో 100 ‘మీ మార్ట్’లు: జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ. కార్పొరేట్ తరహాలో రేషన్ దుకాణాల ఆధునీకరణ.. తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 11:41 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో త్వరలో 100 ‘మీ మార్ట్’లు: జేసీ అభిషేక్ గౌడ!

ఏలూరు: ఏలూరు జిల్లాలో త్వరలో 100 'మీ మార్ట్' లను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ తెలిపారు.భీమడోలు మండలం ఎం.ఎం.పురంలో ఏర్పాటు కానున్న 'మీ మార్ట్' పనులను మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, జిల్లాలోని విశాలమైన ప్రాంగణాలు కలిగిన 100 రేషన్ దుకాణాలను గుర్తించి, వాటిని కార్పొరేట్ మార్ట్‌లకు ధీటుగా "మీ మార్ట్" లుగా తీర్చిదిద్దుతామన్నారు.

ఈ మార్ట్‌లలో ప్రజలకు అవసరమైన అన్ని నాణ్యమైన నిత్యావసర సరుకులు తక్కువ ధరకే లభిస్తాయని పేర్కొన్నారు. సరుకుల నాణ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సూచనలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్,భీమడోలు తహసీల్దార్ రమాదేవి,రెవిన్యూ,పౌర సరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్