Eluru: అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవ వేడుకలు

Eluru: ఏలూరులో అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవ వేడుకలు. బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థినులకు దిశానిర్దేశం చేసిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Sept 2026 11:42 PM IST
Eluru
X

Eluru: అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవ వేడుకలు

ఏలూరు: అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం సందర్భంగా నేడు ఏలూరులోని ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలికల వసతి గృహంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి యన్.శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ బాలికలు అన్ని పరిస్థితుల్లోనూ మానసికంగా బలంగా ఉండాలని,ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని శ్రీమతి శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు.

తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆశయాలను నెరవేర్చడానికి విద్యార్థినులు విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు.జీవన అభివృద్ధికి క్రమశిక్షణే ముఖ్యమని,క్రమ శిక్షణతో కూడిన విద్యే ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని సూచించారు.సదస్సు అనంతరం వసతి గృహంలోని పరిసరాలను,విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాలను ఆమె స్వయంగా పరిశీలించి,సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సదస్సులో జడ్జి ప్రసంగాన్ని సైన్ ట్రాన్స్ లేటరు రాకేష్ సంజ్ఞా భాషలోకి అనువదించి విద్యార్థినులకు వివరించారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ జ్యోతి, నాన్ టీచింగ్ సిబ్బంది,మరియు వసతి గృహ విద్యార్థినులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్