Eluru: ప్రభుత్వ బోరు ఆక్రమణ.. ప్రజా ధనం వ్యక్తిగత వ్యాపారానికి!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గణపవరంలో దారుణం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 21 Jun 2026 7:16 PM IST
Eluru
X

Eluru: ప్రభుత్వ బోరు ఆక్రమణ.. ప్రజా ధనం వ్యక్తిగత వ్యాపారానికి!

Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గణపవరం పంచాయితీలోని గణపవరం గ్రామ ప్రజల తాగునీటి అవసరాల కోసం గత ప్రభుత్వం పంచాయితీ నిధులతో వేసిన ప్రభుత్వ బోరుకు మోటర్ ను అమర్చి అదే గ్రామానికి ఓ వ్యక్తి తన జామాయిల్ క్లోన్ నర్సరీలో మొక్కలు తడిపేందుకు వినియోగిస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్నారనీ పలువురు బాహాటంగానే చెబుతున్నారు.

సంబంధిత అధికారులకు సమచారం ఇచ్చిన స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పంచాయతీ నిధులతో వేసిన బోరు బావికి మోటార్ అమర్చకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో, అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆ బోరుకు మోటార్ అమర్చి ప్రభుత్వం పంచాయితీ నిధులతో చేసిన బోరు నీటిని తన వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు గ్రామస్తులు పలుమార్లు పంచాయతీ అధికారులకు పిర్యాదు చేసిన స్పందించకపోవడంతో

ఇట్టి విషయంపై ఎంపిడిఓ దృష్టికి తీసుకువెళ్లగా, ఎంపిడిఓ ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ బోరుకు అమర్చిన మోటారును తొలగించినప్పటికీ, కేవలం వారం రోజుల వ్యవధిలోనే అదే వ్యక్తి మళ్లీ బోరుకు మోటార్ అమర్చినీటిని తన వ్యాపార అవసరాలకు వినియోగించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకున్నా వాటిని ధిక్కరిస్తూ ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లగా

నోటీసు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ప్రభుత్వ బోరుకు మోటార్ అమర్చి జామాయిల్ నర్సరీలు మొక్కలు తడుపుతో లక్షల్లో వ్యాపారం సాగిస్తున్న వ్యక్తిపై ఆక్రమించి ఇప్పటివరకు చర్య తీసుకోలేదని, ఆక్రమించుకున్న పంచాయితీ బోరునును విడిపించి మోటార్ అమర్చి గ్రామస్తులకు నీటి అవసరాల నిమిత్తం వినియోగించు కునేందుకు చర్యలు తీసుకొని తమకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

విధుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి..

గణపవరం గ్రామంలో పంచాయతీ నిధులతో చేసిన బోరును ఆక్రమించుకొని జామాయిల్ క్లోన్ నర్సరీ వ్యాపార వ్యాపార నిమిత్తం నీటిని వినియోగిస్తున్నరని గణపవరం పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం పలు అనుమానాలకు అనుమానాలకు తావిస్తోందిని పలువురు బాహాటంగానే చెబుతున్నారు.

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో బాధ్యత వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు మండి పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకుని ప్రభుత్వ బోరు నీటిని అక్రమంగా వినియోగిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా, ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ, విధుల్లో అలసత్వం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శిపై కూడా శాఖాపరమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story