Eluru: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వైద్య శిబిరం
Eluru: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఏలూరు నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
Eluru: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వైద్య శిబిరం
ఏలూరు: జాతీయ న్యాయసేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్రన్యాయ సేవాధికార సంస్థ,అమరావతి ఆదేశాలు ప్రకారం గురువారం అంతర్జాతీయ వృద్ధులు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీలక్ష్మి ప్రభుత్వ పట్టణ నిరాశ్రయులు వసతి గృహం నందు ఏలూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయము వారి సహకారంతో మెడికల్ క్యాంపును నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీలక్ష్మీ మాట్లాడుతూ నిరాదారానికి గురై ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులు యొక్క సంక్షేమం నిమిత్తం,వారి ఆరోగ్యం పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.మెడికల్ నిర్వహించామని ఈరోజు సాధారణ,మానసిక,కంటి మరియు దంత వైద్యశిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.
వృద్ధులను పరీక్షించి అవసరమైన మందులు మరియు కళ్ళజోడులను సరఫరా చేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే మరి ఇతర న్యాయ సహాయం కావాల్సిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా కాని 15100 ద్వారా సంప్రదించవచ్చని తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శ్రీమతి డా.యు.శోభ మాట్లాడుతూ ఈ నిరాశ్రయులను గృహమునందు మెడికల్ క్యాంపును నిర్వహించడమే కాకుండా తరచుగా వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను సరఫరా చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారికి,వైద్యులకు సిబ్బందికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి శ్రీమతి యన్.శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది,వసతిగృహం నిర్వాహకులు, వృద్ధులు,తదితరులు పాల్గొన్నారు.




