Eluru: మంత్రి లోకేష్‌తో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ భేటీ

Eluru: మంత్రి నారా లోకేష్‌తో ఉండవల్లిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ భేటీ అయ్యారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ, గ్రంథాలయ నిర్మాణాలకు నిధులు కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Oct 2026 8:38 PM IST
Eluru
X

Eluru: మంత్రి లోకేష్‌తో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ భేటీ

ఏలూరు జిల్లా: రాష్ట్ర విద్యా,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం సాయంత్రం ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు.ఏలూరు పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ ఈ సందర్భంగా మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ఏలూరులో బీసీ హాస్టల్ నిర్మాణానికి ₹2 కోట్లు,ఏలూరు పట్టణంలో జిల్లా గ్రంథాలయం నిర్మాణానికి ₹3 కోట్లు,నూజివీడు IIIT ఆధునికీకరణ, సౌకర్యాల కల్పనకు ₹12 కోట్ల నిధుల కేటాయింపు,కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కావాలని ఈ విజ్ఞప్తులను ఎంపీ పుట్టా మహేష్ అడగగా మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.

అనంతరం, ఏలూరు పార్లమెంట్ పరిధిలోని తాజా రాజకీయ పరిస్థితులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ చర్చించారు.ఇదే సమయంలో గత రెండేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులపై రూపొందించిన పుస్తకాన్ని ఎంపీ మంత్రికి అందించగా, లోకేష్ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్