Eluru: ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ పుట్టా మహేష్

Eluru: ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. వేద పండితుల ఆశీర్వచనం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Nov 2026 5:09 PM IST
Eluru
X

Eluru: ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ పుట్టా మహేష్

ఏలూరు: ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బుధవారం ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రజలు మరియు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన స్వామివారిని ప్రార్థించానని అన్నారు.

తొలుత వేద పండితులు ఎంపీకి ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్