Eluru: నూజివీడులో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు!
Eluru: నూజివీడులో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. శ్రీ సారధి ఇంజనీరింగ్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఫలితాలపై ఉత్కంఠ.
Eluru: నూజివీడులో ఉత్కంఠ రేపుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు!
Eluru: నూజివీడు పట్టణ పరిధిలో ఉత్కంఠ రేపుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం అత్యంత పారదర్శకంగా ప్రారంభమైంది. పట్టణంలోని శ్రీ సారధి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉదయం 8 గంటలకే అధికారులు లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టారు. నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న,డిఎస్పి కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్ సీల్‌ను తెరిచారు.
అనంతరం కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్లోకి తరలించారు.సరిగ్గా ఉదయం 8:10 గంటలకు అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ బాక్సులను అధికారులు ఓపెన్ చేశారు.నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 201 పోస్టల్ బ్యాలెట్లు పోల్ కాగా,స్క్రూటినీ ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల ఒక పోస్టల్ బ్యాలెట్ చెల్లకుండా (Invalid) పోయింది.దీంతో మిగిలిన 200 వ్యాలిడ్ (Valid) పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపును అధికారులు.
కౌంటింగ్ ప్రక్రియను ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, నూజివీడు మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య లు దగ్గరుండి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల ఫలితాల్లో సాధారణంగా పోస్టల్ బ్యాలెట్లలో లభించే ఆధిక్యం (లీడ్) విజయావకాశాలపై గట్టి ప్రభావం చూపుతుందనే సెంటిమెంట్ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది.దీంతో ఈ 200 పోస్టల్ బ్యాలెట్లలో ఏ అభ్యర్థికి మెజారిటీ వస్తుందనే దానిపై ఇటు రాజకీయ పార్టీల్లోనూ,అటు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.మరికొద్ది సేపట్లోనే ఈ పోస్టల్ బ్యాలెట్ల తొలి రౌండ్ ఫలితాలు వెలువడనున్నాయి.నూజివీడు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎవరు మరియు 36 వార్డులలోని గెలిచే అభ్యర్థులు భవిష్యత్తు నేడు సాయంత్రంతో తేలనుంది.




