Eluru: ఏలూరులో ఎన్నికల ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులు శేషగిరిబాబు సమీక్ష

Eluru: ఏలూరు జిల్లాలో ఈనెల 28న పోలింగ్. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని పరిశీలకులు శేషగిరిబాబు ఆదేశం. సమీక్షలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 21 Oct 2026 8:56 PM IST
Eluru
X

Eluru: ఏలూరులో ఎన్నికల ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులు శేషగిరిబాబు సమీక్ష

ఏలూరు: ఏలూరు జిల్లాలో నగరపాలక,పురపాలక సంఘాల పోలింగ్,అలాగే జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి సర్వం సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మిరియాల వెంకట శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు.

ఈనెల 28న జరగనున్న పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన కనీస వసతులు,భద్రతా ఏర్పాట్లు మరియు పోలింగ్ శాతం పెంపునకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి,ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తదితర అధికారులకు ఆయన సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్