Eluru: ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 గోడప్రతుల ఆవిష్కరణ!
Eluru: ఏలూరులో విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 గోడప్రతులను ఆవిష్కరించిన ఇన్‌ఛార్జ్ డీఆర్వో ముక్కంటి, అదనపు ఎస్పీ ప్రసాదరావు.
Eluru: ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 గోడప్రతుల ఆవిష్కరణ!
ఏలూరు: సమాజంలో అవినీతిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఇన్ఛార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి ఎం.ముక్కంటి,జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు పిలుపునిచ్చారు.విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా బుధవారం ఏలూరు కలెక్టరేట్,జిల్లా పోలీస్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ రూపొందించిన టోల్ ఫ్రీ నెంబర్ 1064 గోడప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం నుండి అవినీతిని పారద్రోలడానికి ప్రజల్లో చైతన్యం ఎంతో అవసరమన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగినా,అవినీతికి పాల్పడినా ప్రజలు భయపడకుండా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.ఏసీబీ డీఎస్పీ జి.వి.కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలనకు తమ శాఖ నిరంతరం కృషి చేస్తోందని,ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య,ఏసీబీ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసు,కలెక్టరేట్ మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.




