Eluru: పెద్దవాగుకు వరద ప్రమాదం - ముంపు గ్రామాల ప్రజల తరలింపు
Eluru: మురసు తుఫాన్ కారణంగా పెద్దవాగుకు భారీ వరద. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశం.
Eluru: పెద్దవాగుకు వరద ప్రమాదం - ముంపు గ్రామాల ప్రజల తరలింపు
ఏలూరు: మురసు తుఫాన్ కారణంగా తెలంగాణ నుండి పెద్దవాగుకు భారీగా వరద నీరు పోటెత్తడంతో ఏలూరు జిల్లాలోని కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ మరియు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన అత్యవసర టెలి కాన్ఫరెన్స్లో కలెక్టర్ వరద పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేలేరుపాడు,కమ్మరిగూడెం,ఒంటిబండ,కోయమాదారం,కొత్తపుచీరాల,పాతపుచీరాల,అల్లూరినగర్,సొండిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయిలతో పాటు ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలి. ముఖ్యంగా గర్భిణీలను సమీప పీహెచ్సీలకు, అలాగే వయోవృద్ధులు, పిల్లలు, దివ్యాంగులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలి.
రక్షణ చర్యలు & రవాణా: వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం బోట్లను సిద్ధం చేయాలి. రహదారి మార్గాలు దెబ్బతిన్న గ్రామాలకు బియ్యం, నిత్యావసర సరుకులను అత్యవసరంగా సరఫరా చేయాలి.
భద్రతా నిఘా: ప్రజలు కల్వర్టులు, వాగులు, కాజ్వేలు దాటకుండా ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లను ఏర్పాటు చేయాలి. నదులు, చెరువులు, కాలువల వద్దకు ఎవరూ వెళ్లకుండా సిబ్బందిని నియమించి పటిష్ట నిఘా ఉంచాలి.
జీరో క్యాజువాలిటీ: ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.




