Kukunoor: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: కొన్నె లక్ష్మయ్య!

Kukunoor: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండల కేంద్రంలో జరిగిన సీపీఐ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మండల కార్యదర్శి కొన్నె లక్ష్మయ్య పిలుపునిచ్చారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 12 Nov 2026 4:40 PM IST
Kukunoor
X

Kukunoor: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి: కొన్నె లక్ష్మయ్య!

కుక్కునూరు: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ తన సత్తా చాటాలని సీపీఐ కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సో డే. నాగేష్ అధ్యక్షతన జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఎల్లప్పుడూ ముందుంటుందని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.

గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి పంచాయితీలో పార్టీ జెండా ఎగరాలని,ఇతర పార్టీలకు ధీటుగా ఉన్నామని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సమితి నాయకులు అయితా.సురేష్ బాబు,ఏపీ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరకా. శ్యామల, మైసాక్షి. వెంకటా చారి,కూరకుల. బాబురావు,వరసా. పాపారావు, ఎకో. సోమరాజు, మడకం. ఉంగా తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR