Kukunoor: సర్పంచ్ నామినేషన్లకు సర్వం సిద్ధం.. అయినా కనిపించని సందడి!

Kukunoor: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల నామినేషన్లకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా, ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్లు నమోదు కాలేదు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 15 Nov 2026 2:48 PM IST
Kukunoor
X

Kukunoor: సర్పంచ్ నామినేషన్లకు సర్వం సిద్ధం.. అయినా కనిపించని సందడి!

కుక్కునూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవులకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కుక్కునూరు మండలంలో 9, వేలేరుపాడు మండలంలో 6 నామినేషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టి అధికారులు సిద్ధంగా ఉన్నారు.

అయితే ఆదివారం కావడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ రెండు మండలాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అభ్యర్థుల నుంచి స్పందన లేకపోవడంతో నామినేషన్ కేంద్రాలు బోసిపోయాయి. ఎన్నికల సందడి కనిపిస్తుందని భావించినప్పటికీ తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు.

సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు పలువురు ఆశావహులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR