Eluru: నేరాలకు దూరంగా ఉండాలి: నూజివీడులో రౌడీషీటర్లకు హెచ్చరిక

Eluru: నూజివీడు టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 3:51 PM IST
Eluru
X

Eluru: నేరాలకు దూరంగా ఉండాలి: నూజివీడులో రౌడీషీటర్లకు హెచ్చరిక

ఏలూరు జిల్లా: ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్,నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు నూజివీడు రూరల్ సీఐ ఐ.వి.నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నూజివీడు టౌన్,రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ రౌడీషీటర్లు నేరాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత జీవనం సాగించాలని సూచించారు. బెదిరింపులు, గొడవలు, దౌర్జన్యాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మణ్ బాబు, జ్యోతి బోస్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story