Eluru: రోడ్లపై పడిన చెట్ల తొలగింపు.. రవాణా పునరుద్ధరణ!
Eluru: 'అర్నాబ్' తుఫాన్ వేళ ఏలూరు జిల్లాలో పోలీస్ హై అలర్ట్. తొలగిన చెట్లతో రవాణా పునరుద్ధరణ. అత్యవసర సహాయానికి 112, 95503 51100 కు కాల్ చేయండి: ఎస్పీ
Eluru: రోడ్లపై పడిన చెట్ల తొలగింపు.. రవాణా పునరుద్ధరణ!
Eluru: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ హై అలర్ట్ అయింది.ఏలూరు జిల్లాలో వీచిన బలమైన ఈదురు గాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..ప్రజలకు,వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బంది అప్రమత్తమయ్యారు.ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ,క్రేన్లు,బుల్డోజర్ల సహాయంతో రహదారుల పై అడ్డంగా పడిన చెట్లను తక్షణమే తొలగించి రవాణాను పునరుద్ధరించారు.
తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు,బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు.అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకూడదు అని పెద్ద చెట్లు,విద్యుత్ స్తంభాలు,హోర్డింగ్‌ల కింద నిలబడొద్దు అని తెగిపడిన విద్యుత్ తీగలను,
రోడ్లపై పడిన చెట్లను తాకకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలి అని వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ,అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి ప్రజల ప్రాణాలు,ఆస్తుల రక్షణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.ప్రమాదాలు జరిగినా,అత్యవసర సహాయం కావాలన్నా వెంటనే డయల్ 112 లేదా 95503 51100 నంబర్లకు సమాచారం అందించాలని ఏలూరు జిల్లా పోలీస్ శాఖ కోరింది.




