Eluru: ఏలూరు జిల్లాలో 200 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ

Eluru: ఏలూరు జిల్లాలో సెప్టెంబర్ నెలలో రూ.50 లక్షల విలువైన 200 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు: ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Oct 2026 2:36 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో 200 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్‌లో పోలీసులు 200 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా,వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు కాగా రికవరీ చేసిన ఫోన్లను అధికారులు సంబంధిత బాధితులకు అందజేస్తున్నారు.

మొబైల్ పోగొట్టుకున్న వారు వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్