Eluru: రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన పర్యావరణ శాఖ ఈఈ

Eluru: ఏలూరులో NOC కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన పర్యావరణ పరిరక్షణ శాఖ ఈఈ శ్రీరామచంద్ర మూర్తి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Nov 2026 11:11 PM IST
Eluru
X

Eluru: రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన పర్యావరణ శాఖ ఈఈ

ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యావరణ పరిరక్షణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) ఏ.శ్రీరామచంద్ర మూర్తి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారుఈ మేరకు ఏసీబీ డీఎస్పీ వి.కృష్ణారావు తెలిపారు.

ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోడౌన్ నిర్మాణానికి సంబంధించి 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (NOC) మంజూరు చేయడానికి ఈఈ శ్రీరామచంద్ర మూర్తి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.బాధితుడైన ఏలూరుకు చెందిన మత్తే బాబీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

శుక్రవారం తన కార్యాలయంలో బాధితుడి నుండి రూ.30,000 లంచం తీసుకుంటుండగా శ్రీరామచంద్ర మూర్తిని ఏసీబీ బృందం వలపన్ని పట్టుకుంది.నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ కృష్ణారావు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్