Eluru: గండేపల్లి పోలీస్ స్టేషన్‌లో డిఐజి అశోక్ కుమార్ తనిఖీలు
Eluru: కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు. జాతీయ రహదారిపై 18 ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు.
Eluru: గండేపల్లి పోలీస్ స్టేషన్‌లో డిఐజి అశోక్ కుమార్ తనిఖీలు
Eluru: కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్ లో గురువారం ఉదయం ఏలూరు రేంజ్ డిఐజి జి.వి.జి అశోక్ కుమార్ వార్షిక తనిఖీలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ,డి.ఎస్.పి ఏజీబీ తిలక్ ఘన స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు పలు అంశాలు, పెండింగ్ కేసుల పట్ల సంబంధించి జగ్గంపేట సీఐ తిరుపతిరావు, గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందన్నారు. అలాగే గండేపల్లి మండలంలో జాతీయ రహదారి సుమారుగా 16 కిలోమీటర్లు ఉండడంవల్ల 18 బ్లాక్ స్పాట్స్ గుర్తించమన్నారు. వ్యాపారస్తులంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రానున్న పుష్కరాలకు సంబంధించి పలు శాఖల అధికారుల సమన్వయంతో ఇప్పటినుంచి పటిష్టమైన రోడ్డు భద్రత చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
పుష్కరాలకు తరలి వెళ్లే భక్తులకు అంతరాయం లేకుండా రెండు విధాలుగా బైపాస్ రోడ్లు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఏర్పడితే ప్రత్యామ్నాయంగా వేరే మార్గం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. త్వరలో జాతీయ రహదారి విస్తరణ జరగవలసి ఉందని దానిపై కూడా తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జగ్గంపేట నియోజకవర్గం లో జాతీయ రహదారి సుమారు 25 కిలోమీటర్లు ఉందని అందుచే ఒకటే ఉన్న హైవే మొబైల్ వాహనం అదనంగా ఇంకోటి ఇస్తానన్నారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో పోలీస్ మెన్ తక్కువగా ఉన్నారని వీలైనంత త్వరగా అవి కూడా పూర్తి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గండేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ శ్రామికులతో ఆయన కొంతసేపు ముచ్చటించారు. పలు చట్టాల పట్ల వారికి అవగాహన కల్పించారు. వేసవి దృష్ట్యా దొంగతనాలు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. వారందరికీ చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు.




