Eluru: దీపావళి బాణసంచా విక్రయాలు: నవంబర్ 2లోగా దరఖాస్తు చేయండి!

Eluru: ఏలూరు రెవిన్యూ డివిజన్ పరిధిలో దీపావళి బాణసంచా తాత్కాలిక విక్రయ లైసెన్సుల కోసం నవంబర్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్డీఓ లక్ష్మీప్రసన్న తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Oct 2026 9:54 PM IST
Eluru
X

Eluru: దీపావళి బాణసంచా విక్రయాలు: నవంబర్ 2లోగా దరఖాస్తు చేయండి!

Eluru: దీపావళి పండుగ సందర్భముగా ఏలూరు రెవిన్యూ డివిజన్ పరిది లోని మండలాల నందు తాత్కాలికముగా దీపావళి బాణా సంచా సామాగ్రి విక్రయించుకొనుటకు తాత్కాలిక లైసెన్స్ కొరకు ధరఖాస్తు చేసుకోను నవంబర్,2వ తేదీ లోగా తమ కార్యాలయంనకు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు రెవిన్యూ డివిజినల్ అధికారి లక్ష్మీప్రసన్న తెలిపారు.ధరఖాస్తుతో పాటు ధరఖాస్తు దారుని ఆధార్ కార్డు,పాన్ కార్డు,చలానా ఓరిజినల్ మరియు ధరఖాస్తుదారుడు తప్పని సరిగా GST చెల్లించి సదరు రసీదును జతపరచాలన్నారు.సదరు లైసెన్స్ మంజూరు విషయములో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు ఇచ్చిన ఆదేశములు,ఉత్తర్వులును అనుసరించి లైసెన్స్ లు మంజూరు చేయబడునని ఆర్డీఓ తెలియజేసారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్