Eluru: ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, డిప్యూటీగా శారద ఎన్నిక

Eluru: ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, 62 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం; డిప్యూటీ మేయర్‌గా పృధ్వి శారద ఏకగ్రీవ ఎన్నిక, నేతల అభినందనలు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 23 Nov 2026 8:21 PM IST
Eluru
X

Eluru: ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, డిప్యూటీగా శారద ఎన్నిక

ఏలూరు: ఏలూరు నగర మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు సోమవారం పదవీ స్వీకారం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆయనతో పాటు 62 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జరిగిన ఎన్నికలో డిప్యూటీ మేయర్‌గా పృధ్వి శారద ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించి,ధృవీకరణ పత్రం అందజేశారు.

రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు మిరియాల వెంకట శేషగిరిబాబు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారునూతన మేయర్,డిప్యూటీ మేయర్‌లకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్,కలెక్టర్ కె.వెట్రిసెల్వి,ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, పత్సమట్ల ధర్మరాజు తదితరులు అభినందనలు తెలిపారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid