Eluru: బొలెరో వాహనాన్ని వెనకనుంచి ఢీకొన్న ట్రాలీ ఆటో.. ఒకరు మృతి
Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బోనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Eluru: బొలెరో వాహనాన్ని వెనకనుంచి ఢీకొన్న ట్రాలీ ఆటో.. ఒకరు మృతి
Eluru: బొలెరో వాహనాన్ని వెనక నుంచి ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కుక్కునూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే
ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని బోనగిరి గ్రామంలోని జామాయిల్ క్లోన్ నర్సరీలో పనిచేయడానికి చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన పొడియం మోటు మూడు వారాల క్రితం వచ్చి జామాయిల్ నర్సరీలో పనిచేస్తున్నాడు. జామాయిల్ మొక్కలు లోడ్ చేసి 16న బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా,
బోనగిరి గ్రామ సమీపంలోని గొర్ల మురళి క్రిష్ణ జామాయిల్ క్లోన్ నర్సరీ వద్ద వాహనాన్ని నిమ్మదించి, లోపలికి మలుపు తిప్పుతున్న సమయంలో వెనకనుంచి వచ్చిన ట్రాలీ ఆటో వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బొలెరో వాహనం వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బొలెరో వాహనం వెనక భాగంలో కూర్చున్న పోడియం మోటు తలకు, కుడి కాలుకు తీవ్రంగా గాయాలు కావడంతో, స్థానికులు 108 అంబులెన్స్ లో భద్రాచలం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మోటు మృతి చెందాడు. మృతుడి సోదరుడైన పోడియం లచ్చు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కే రాజారెడ్డి, సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీ ఆటో డ్రైవర్ పై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.




