Eluru: చింతలపూడిలో ఎన్నికల భద్రతపై ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

Eluru: ఏలూరు జిల్లా చింతలపూడిలో హైకోర్టు న్యాయమూర్తులను ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కలిశారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 10:28 PM IST
Eluru
X

Eluru: చింతలపూడిలో ఎన్నికల భద్రతపై ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

ఏలూరు: ఏలూరు జిల్లా చింతలపూడిలో నూతన కోర్టు భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్.జయసూర్య,జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిలను ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

అనంతరం చింతలపూడి సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రానున్న జడ్పీటీసి,ఎంపీటీసి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చింతలపూడి, లింగపాలెం మండలాల్లోని భద్రతా ఏర్పాట్లు,ముందస్తు చర్యలపై పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం స్థానిక పోలింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.నిర్భయంగా ఓటు హక్కు ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా క్షేత్రస్థాయి ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉండాలి అని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి అని ఓటర్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా క్రమపద్ధతిలో క్యూలైన్ల నిర్వహణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలి అని పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో గుంపులుగా చేరడం నిషేధమని,పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించాలి అని పోలింగ్ కేంద్రాల చుట్టూ రాజకీయ ప్రసంగాలు,కరపత్రాల పంపిణీ జరగకుండా కఠిన నిఘా ఉంచాలని.

ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్,ఎస్సై సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్