Eluru: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన పోలీసు సిబ్బంది

Eluru: ఏలూరు జిల్లాలో హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సిబ్బంది ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 7 Sept 2026 6:32 PM IST
Eluru
X

Eluru: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన పోలీసు సిబ్బంది

ఏలూరు: ఏలూరు జిల్లాలో 26 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 18 మంది,రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో 5 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి.

పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందిస్తూ పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని తెలిపారు.

ప్రజలకు చేరువగా ఉంటూ,నిజాయితీ,నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.మారుతున్న నేరాల నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేర నియంత్రణ,దర్యాప్తులో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story