Eluru: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేందుకు ముందుకు రావాలి
Eluru: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునేవారికి పూర్తి రక్షణ ఉంటుందని, గుడ్ సమరిటన్ అవార్డుతో పాటు ఆర్థిక సహాయం అందిస్తామని ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.
Eluru: రోడ్డు ప్రమాద బాధితులను కాపాడేందుకు ముందుకు రావాలి
ఏలూరు: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను సకాలంలో ఆదుకుని,వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ పిలుపునిచ్చారు.పోలీసు కేసులు,కోర్టుల చుట్టూ తిరగాలనే అపోహలతో ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది సహాయం చేయడానికి వెనకడుగు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
108 అంబులెన్స్ వచ్చేలోపు స్థానికులు స్పందించి ప్రాథమిక చికిత్స లేదా సీపీఆర్ (CPR) అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని సూచించారు.రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం తరఫున రూ. 25,000 నుండి రూ. 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
అని ప్రమాద సమయాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన సామాన్యులను ప్రభుత్వం 'గుడ్ సమరిటన్ అవార్డ్'తో ఘనంగా సత్కరిస్తుంది అని సహాయం చేసే వారిని పోలీసులు ఎలాంటి కేసుల్లోనూ ఇబ్బంది పెట్టరు అని వీరికి చట్టపరంగా పూర్తి రక్షణ ఉంటుంది అని ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే భయపడకుండా వెంటనే 108 అంబులెన్స్‌కు మరియు పోలీసులకు సమాచారం అందించాలని,మానవత్వంతో స్పందించి విలువైన ప్రాణాలను కాపాడడంలో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు.




