Eluru: కైకలూరు పునరావాస కేంద్రాల్లో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పర్యటన!
Eluru: కైకలూరు తుఫాన్ పునరావాస కేంద్రాలను ఎస్పీ శివ కిషోర్ పరిశీలించి, బాధితులకు పండ్లు పంచారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Eluru: కైకలూరు పునరావాస కేంద్రాల్లో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పర్యటన!
Eluru: ‘అర్ణబ్’ తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. లఇందులో భాగంగా కైకలూరు టౌన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ నేడు సందర్శించారు.
కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రజలను స్వయంగా కలుసుకుని,వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం బాధితులకు పండ్లు,బిస్కెట్లను పంపిణీ చేసి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా పునరావాస కేంద్రాలలో అందుబాటులో ఉన్న తాగునీరు,ఆహారం, లవిద్యుత్,పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలపై అధికారులను ఆరా తీసిన ఎస్పీ,బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అనంతరం క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ భారీ వర్షాలు,ఈదురు గాలుల కారణంగా రహదారులపై, ఇళ్లపై పడిన చెట్లను జేసీబీలు,ఇతర యంత్రాల సహాయంతో తక్షణమే తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని సూచించారు.నదులు,కాలువలు,నీటి ప్రవాహాలు ఉన్న లోతట్టు ప్రాంతాల్లో పోలీస్, రెవెన్యూ,విపత్తు నిర్వహణ శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యతని తెలిపిన ఎస్పీ గారు.. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేకుండా లోతట్టు,ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని, తెగిపడిన విద్యుత్ తీగలు,పొంగి ప్రవహించే వాగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఈ పర్యటనలో జిల్లా ఎస్పీతో పాటు ఏలూరు డిఎస్పి డి.శ్రావణ్ కుమార్,కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ,కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ రవికుమార్,రూరల్ ఎస్సై రాంబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు




