Eluru: సమస్యల త్వరిత పరిష్కారమే లక్ష్యం ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్!

Eluru: ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 7 Sept 2026 5:42 PM IST
Eluru
X

Eluru: సమస్యల త్వరిత పరిష్కారమే లక్ష్యం ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్!

Eluru: ప్రజల సమస్యలను వేగంగా,నిష్పక్షపాతంగా,పారదర్శకంగా పరిష్కరించడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎస్పీ, అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. ప్రసాద్ రావు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

భూ వివాదాలు,కుటుంబ తగాదాలు,ఆర్థిక మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి,సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి తక్షణ చర్యలకు ఆదేశించారు.ఫిర్యాదులపై చట్టప్రకారం నిష్పక్షపాత విచారణ జరిపి నిర్ణీత గడువులో నివేదికలు సమర్పించాలని సూచించారు.

ప్రజలు తమ సమీప సబ్‌-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందజేయవచ్చని, ‘మీకోసం’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.ఫిర్యాదుల పురోగతిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story