Eluru: పోలవరం ఎంపీటీసి ఎన్నికల్లో కూటమిలో బేధాలు..బరిలో టీడీపీ, జనసేన!

Eluru: పోలవరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ఎంపీటీసి స్థానానికి టీడీపీ, జనసేన వేర్వేరుగా అభ్యర్థులను బరిలోకి దించడంతో వైఎస్సార్‌సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 1 Nov 2026 1:38 PM IST
Eluru
X

Eluru: పోలవరం ఎంపీటీసి ఎన్నికల్లో కూటమిలో బేధాలు..బరిలో టీడీపీ, జనసేన!

Eluru: పోలవరం స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీకి ఎదురులేదనట్టుగా నాయకులు చాలా ఆనందంగా నామినేషన్లు వేశారు. అప్పుడే అసలైన కథ మొదలైంది. టిడిపిలో ఎవరు నామినేషన్ వేస్తున్నారు అని చాప కింద నీరుల వ్యవహరించిన వైసిపి పార్టీ నాయకులు ఒక్కసారిగా పార్టీలో నిలబడుతున్న నాయకులకు దీటుగా వైసీపీ పార్టీలో నాయకులు వైసిపి ఎంపిటిసి అభ్యర్థులుగా బరిలోకి దింపారు.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టిడిపి నాయకులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకోవడమే కాకుండా మళ్లీ ఎవరిని మార్చాలంటూ తగ్గిన భజన పడినట్లు కూడా విశ్వసనీయమైన సమాచారం. పోలవరం మండలంలో ప్రోటోకాల్ ఉన్న నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ టిడిపి పార్టీ గెలిపించే భారం వారి మీద ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ కూటమిలో సైక్యత లేదు.

పోలవరం పంచాయతీలో ఒకటవ సెగ్మెంట్ ఎంపీటీసీ అభ్యర్థిగా టిడిపిలోనికి ఒక వ్యక్తిని బి ఫామ్ ఇచ్చి బరిలోకి దింపారు . ఇంకా ఆ అభ్యర్థి ఎంపీటీసీ అభ్యర్థిగా అనుకున్న తరుణంలో నామినేషన్లు టైం పూర్తయ్యే సమయంలో జనసేన నుండి మరో వ్యక్తి బీఫామ్ పట్టుకుని వచ్చి బర్లోకి దిగడంతో టిడిపి నాయకులలో అలజడి మొదలైంది.

కలిసి తిరగండి కలిసి చేసుకోండి అని కూటమి ధర్మం గాడి తప్పింది. ఒకవైపు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కలిసికట్టుగా విజయం సాధించాలని మాట్లాడడం, దీనికి పోలవరంలో విరుద్ధంగా జరగడం గమనార్థం గా మిగిలిందని పోలవరం మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

అంటే పోలవరంలో జనసేనకు టిడిపికి పొత్తులు ఉన్నట్టా లేనట్లా ఎవరికి ఓటు వెయ్యాలి అని ఓటర్లు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. టిడిపి నాయకులు మాత్రం ఈ సెగ్మెంట్లో తప్పనిసరిగా మా పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాదు జనసేన గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చాప కింద నీరులా వ్యవహరిస్తున్న వైసిపి పార్టీ మాత్రం తమ ఓటు బ్యాంకు ను కాపాడుకుంటూ పాములు కదుపుతుంది కూటమి తప్పనిసరిగా వారు కొన్న ఓట్లు వారే చీల్చుకుని మాకు భారీ మెజార్టీ ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసిపి ఇలా కూటమిలో బీటలు రావడంతో వైసిపికి కలసి వచ్చే పరిణామం అని ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరి పార్టీ లు వారి ధీమా లో ఉన్నారు

అయితే ప్రజలు ఈనెల 5 న జరగబోయే పోలింగ్ పోలవరం ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో, 7 వ తారీఖున కౌంటింగ్ రోజున తెలియ నుంది అంటున్నారు గ్రామ ప్రజలు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM