Eluru: మృతురాలి కుటుంబానికి రూ.2 లక్షల పీఎంజేజేబీవై బీమా చెక్ అందజేత!

Eluru: ఏలూరు జిల్లా చెరువు గొల్లగూడెంలో PMJJBY కింద లబ్ధిదారుడి కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును యూనియన్ బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ అందజేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 25 Jun 2026 7:34 AM IST
Eluru
X

Eluru: మృతురాలి కుటుంబానికి రూ.2 లక్షల పీఎంజేజేబీవై బీమా చెక్ అందజేత!

Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రామవరం పంచాయతీ పరిధిలోని చెరువు గొల్లగూడెం గ్రామానికి చెందిన సోయం లక్ష్మి కుటుంబానికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రూ.2 లక్షల చెక్‌ను యూనియన్ బ్యాంకు వేలేరు పాడు బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ బుధవారం అందజేశారు.

సోయం లక్ష్మి యూనియన్ బ్యాంకులో రూ.436తో పీఎంజేజేబీవై పాలసీ తీసుకుని మృతి చెంద‌గా కుటుంబానికి బీమా సొమ్ము రూ.2 లక్షలు చెల్లించారు. ఈ సందర్బంగా మేనేజర్‌ రామకృష్ణ

మాట్లాడుతూ బ్యాంక్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు తప్పని సరిగా ప్రమాద బీమా, సాధారణ బీమా చేయించుకోవాలని సూచించారు. అలాగే వేలేరుపాడు సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు అయిన పి. వెంకన్నబాబు, బి. శివరామ ప్రసాద్, కే.ఉదయ్ లను ఇన్సూరెన్స్ అయ్యే విధంగా సహాయం చేసినందుకు అభినందించారు.

నామిని అయిన సోయం దుర్గారావు మాట్లాడుతూ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కర్నూల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. ఆంజనే యులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ మరియు వేలేరుపాడు సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్లు పి.వెంకన్న బాబు, బి. శివరామ్ ప్రసాద్, కే. ఉదయ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story